మసాలా పొదీనా

Durga
 కావలసిన పధార్థాలు : క్యారెట్, బంగాళాదుంపలు, బీన్స్, వంకాయ, ఉల్లిపాయ, (తరిగినవి) : 2 కప్పులు నూనె : 1 ½ టేబుల్ స్పూను టొమోటోలు : మూడు చిన్నముక్కలు తరగండి ఉప్పు : సరిపడినంత  గసగసాల : ½ టేబుల్ స్పూను పచ్చికొబ్బరి (తురిమినది) : 1 కప్పు పచ్చి మిరపకాయలు : అయిదు అల్లం : చిన్నముక్క లవంగాలు : రెండు వేయించిన శెనగపప్పు : ½ టేబుల్ స్పూను పొదీనా ఆకులు : ఒక కట్ట జీలకర్ర : కొద్దిగా తయారీ చేసే విధానం : ముందుగా కూరగాయలను కుక్కర్ లో ఉడికించండిప బాండీలో నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర వేసి వేగాక, ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించండి. ఆపై అందులో టోమోటోలను వేసి గుజ్జు అయ్యేదాక గరిటెతో కలబెట్టండి, తగినంత నీరు పోసి, అందులోకి మసాలా కూర చేర్చి పులుసు గట్టిపడేవరకూ వేగనియ్యండి. అంతే మసాలా పుదీనా రెడీ  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: